Sonu Sood: రాజకీయ ప్రవేశంపై స్పందించిన సోను సూద్..! 10 d ago
2020 లాక్‌డౌన్ సమయంలో బాలీవుడ్ నటుడు సోను సూద్ పేదలకు సాయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తన "ఫతే" మూవీ ప్రమోషన్ లో తన రాజకీయ రంగ ప్రవేశం పై మాట్లాడారు. "నాకు కూడా సీఎం, డిప్యూటీ సీఎం అని ఎన్నో ఆఫర్స్ వచ్చాయి.. కానీ నేను వాటిని నిరాకరించాను. మీరు ఒక్కసారి పాపులర్ అయితే జీవితంలో పైకి ఎదగడం గురించి ఆలోచిస్తారు.. కానీ పైకి వెళ్లేకొద్దీ శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది" అని సోను సూద్ తెలిపారు.